ఏపీ సీఎం చంద్రబాబుని ప్రముఖులతో వెళ్లి కలిసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, కమ్మవారి సేవ సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు, సీవీఆర్ ఛానల్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు, కమ్మసంఘం ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో కలిసి పూల బొకే అందించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నాల్గో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పంపే సిఫార్స్ లేఖలను పరిగణలోకి తీసుకొని ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని, గత కొన్ని నెలలుగా తిరుపతి దర్శనాలు రద్దు చేయడం జరిగినదని, తిరిగి పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడుని కోరారు.

సీఎం చంద్రబాబును వెళ్లి కలిసిన వారితో..

దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి భక్తుల సౌకర్యార్థం త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చపరాల శ్రీనివాస దాస్, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, పాతూరి వెంకట్ రావు, తాళ్లూరి చంద్రమౌళి, పొట్లూరి పాండు రంగారావు, నాగభూషణం, అనిల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here