శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ప్రగతి నగర్ లోని నీలిమా హైట్స్ అపార్ట్మెంట్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక సేవకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ అపార్ట్‌మెంట్ మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల కోసం వినోదాత్మక ఆటలు నిర్వహించారు. అందులో మ్యూజికల్ ఛైర్స్, ప్రొటెక్ట్ యువర్ బెలూన్, ఫిల్ ద వాటర్ బాటిల్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహించి మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. అలాగే మొదటి బహుమతి కింద రూ.5వేలు, రెండో బహుమతిగా రూ.3వేలు అందజేశారు.

ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారికి గౌరవం, ప్రోత్సాహం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పిల్లలు, నివాసితులు, ఏ. ఆర్. పి. టీం సభ్యులు పాల్గొన్నారు.






