అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్

  • యాదవ పెద్దల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : యశ్వంత్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ ను నియమితులయ్యారు. ఆయనను నియమిస్తూ  రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో నియామక పత్రం అందజేశారు. యశ్వంత్ యాదవ్ తన చిన్న వయసు నుంచే తన తండ్రి గొర్ల మహేశ్వర్ రాజ్ యాదవ్, బాబాయ్ రాగం నాగేందర్ యాదవ్ ప్రోత్సహంతో యాదవ సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అతని ప్రస్థానం భేల్ ఎంప్లాయీస్ యాదవ్ సంఘం, శేరిలింగంపల్లి యాదవ సంఘం నుంచి రాష్ట్ర , జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన యాదవ యువ నేత యశ్వంత్ రాజ్ యాదవ్. అతడి సేవలు గుర్తించి 2011లో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కార్యదర్శిగా నియమించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా, జాతీయ యువజన కోఆర్డినేటర్ గా, ప్రస్తుతం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నియమించడం రాష్ట్ర నాయకత్వం యువకులలో ఉత్సాహం నింపినట్లు తెలుస్తున్నది. అతడి నియామకం రాష్ట్ర వ్యాప్తంగా పలు యాదవ నేతలు, యువ నేతల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.

అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్

ఈ సందర్భంగా యశ్వంత్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సంగంలో కింద స్థాయి నుండి తనను గుర్తించి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవులలో ఐక్యత, చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తానని, ముఖ్యంగా నిరక్షరాస్యతను గ్రామాల్లో నిర్మూలించే విధంగా తగు ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు జాబ్ మెళా, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు జిల్లాల వారీగా నిర్వహించే ప్రయత్నం చేస్తామన్నారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఆశీస్సులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, యాదవ మహాసభ ముఖ్య నాయకులతో కలుపుగోలుగా ఉంటూ యువ యాదవుల సహకారంతో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులను, జిల్లా యాదవ మహాసభ నాయకులను సంప్రదించి కమిటీలను పూర్తి చేస్తామని తెలిపారు.

యశ్వంత్ రాజ్ యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్

తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్వపన్ ఘోష్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ సింగ్ యాదవ్, ఉపాధ్యక్షులు, శతాబ్ది ఉత్సవ సమితి చైర్మన్ సత్య ప్రకాష్ సింగ్ యాదవ్, ఉపాధ్యక్షులు సొంప్రకష్ యాదవ్, మా గురుదేవులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ యువజన అధ్యక్షులు ప్రదీప్ బెహరా యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి, జి ఎచ్ ఎం సి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్ గార్లకి, ఏషం మనీష్ యాదవ్, విజయ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు, ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here