నమస్తే శేరిలింగంపల్లి : స్వాతంత్య్ర భారత దేశంలో మహిళల, పసిపిల్లల రక్షణ అందని ద్రాక్షల మారిందని, ఇందుకు పాలకవర్గాలు సిగ్గుపడాలని ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప మండిపడ్డారు. కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు నిరసనగా చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కలకత్తాలోని ఆర్ జి కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న పీజీ సెకండియర్ వైద్య విద్యార్థిని 36 గంటలు వైద్య సేవలు అందించి విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం దేశ మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వైద్య విద్యార్థిపై ఘాతుకానికి పాల్పడిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్ర భారత దేశంలో మహిళల, పసిపిల్లల రక్షణ అందని ద్రాక్షల మారిందని, ఇందుకు పాలకవర్గాలు సిగ్గుపడాలని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఆడపిల్లలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.