శేరిలింగంపల్లి: కొండాపూర్ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్ తులిప్ అపార్ట్‌మెంట్స్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ వీధులలో డ్రైనేజీ పొంగటంతో మురుగు నీరు రహదారి వెంబడి వెళ్లటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్ హమీద్ పటేల్ స్పందించి వాటర్ బోర్డు మేనేజర్ శ్రీమన్నారాయణకి సమాచారం అందించారు. ఈ క్రమంలో సంబంధిత విభాగం సిబ్బంది సీవరేజ్ ఎయిర్‌టెక్ మెషిన్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ స్వయంగా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు. అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలలో వచ్చే వేస్టేజ్ ను డ్రైనేజీ లైన్లలోకి వెళ్లకుండా చూడాలని భవన యజమానుదారులకు సూచించారు. డివిజన్ లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అవసరం ఉన్న చోట్ల చాలా వరకు కొత్త డ్రైనేజీ లైన్లను వేశామని, ఇంకా అక్కడడక్కడ మార్చవలసిన అవసరం ఉందని త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట డీజీఎం శ్రీమన్నారాయణ, తెరాస సీనియర్ నాయకులు రాణి, మహ్మద్ ఉస్మాన్, శంకర్, సాగర్, సలీం, రసూల్ పటేల్, యూత్ నాయకులు దీపక్, హర్ష, అరుణ్, ఖుర్షిద్, కాలనీ వాసులు ఉన్నారు.






