శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): 3ఎ సైడ్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మే 28 నుంచి 31 వరకు పాండిచ్చేరిలో 2వ ఫెడరేషన్ కప్ పోటీలను స్త్రీ, పురుషుల విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు గాను చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో 3ఎ సైడ్ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఆసక్తి ఉన్న స్త్రీ, పురుషులకు సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ఉదయం 7 గంటలకు స్టేడియంకు చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెంకటేష్ గౌడ్ (ఫోన్ నంఫ 9701859999, మహేష్ (9966061666), ఎన్‌వైకే రెడ్డి (9441039353, 9052993000)లను సంప్రదించవచ్చని తెలిపారు.






