శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మాదాపూర్ వార్డు ఆఫీస్‌లో కొనసాగుతున్న మాదాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని మార్చామని డీసీ ఒక ప్రకటనలో తెలిపారు. హైటెక్స్ సమీపంలో ఉన్న నాక్ బిల్డింగ్‌లోకి మాదాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని మార్చినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని, ఇకపై తమ సమస్యల పరిష్కారం కోసం నాక్ బిల్డింగ్‌లోని సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.






