శంకర్ నగర్‌లో సిసి రోడ్డు పనుల ప‌రిశీల‌న

శేరిలింగంపల్లి, మార్చి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయ‌ని మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ రోడ్ నంబర్ 9 లో కొత్తగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆమె బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, సిసి రోడ్డు పటిష్టంగా ఉండాలంటే క్యూరింగ్ (నీళ్లు పట్టడం) సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అధికారులు, స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here