శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ సందయ్య నగర్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ లోని ప్రతి కాలనీలలో, బస్తీల్లో గుంతలమయం లేకుండా సౌకర్యవంతమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి స్థానికవాసులకు వెసులుబాటుగా ఉండేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. సీసీ రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విధ్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో అధిగమించామని. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చినట్లైతే తక్షణమే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ఆరంభ టౌన్షిప్ మాజీ అధ్యక్షుడు బసవయ్య, కోదండరావు, సురభి కాలనీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్, సబినా కుమారి, నీలకంఠ రెడ్డి, సౌజన్య, కల్యాణి, జయ, రాములమ్మ, కుటుంబరావు, నరసింహ రెడ్డి, నెంరామ్ చౌదరి, బలరాం వర్మ, సాంబశివరావు, శిరీష, డాక్టర్ మధు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అఫ్రీన్, లక్ష్మి జయలక్ష్మి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.






