శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. బుధవారం మియాపూర్ ఎక్స్ రోడ్డులో వాహనదారులు మరింత సజావుగా రాకపోకలు సాగించేందుకు గాను ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రహదారులపై ఏర్పడ్డ గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేసినట్లు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు.






