మ‌సీదు బండ‌లో ముస్లింల‌కు ఈద్ కానుక‌ల పంపిణీ

శేరిలింగంపల్లి, మార్చి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో మసీదు బండలో నిర్వ‌హించిన ఈద్ కానుక‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో స్థానిక ముస్లింలు పాల్గొని బ‌హుమ‌తుల‌ను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పండుగలను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జహంగీర్, సెక్రటరీ ఎండి. అజామ్, ఐవైసీ డివిజన్ ప్రెసిడెంట్ కొడిచర్ల మహేందర్, ఇమ్రాన్, రిషి రాయ్, లావణ్ కుమార్, నాగరాజ్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here