ఘనంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి: హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్, లయన్ క్లబ్ ఆఫ్ శేరిలింగంపల్లి మిత్ర అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం చందానగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ కొండా విజయ్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండా విజయ్ పేద‌ల‌కు హోప్ ఫౌండేష‌న్ ద్వారా చేస్తున్న సేవ‌లు అభినంద‌నీయ‌మ‌న్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సంస్థ తరపున ఎంతో మందికి నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసి ఆదుకున్నార‌న్నారు. ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హిస్తూ అవ‌స‌రం ఉన్న వారికి ర‌క్తం అంద‌జేస్తున్నార‌ని తెలిపారు. కొండా విజ‌య్ కుమార్ పేద‌ల‌కు చేస్తున్న సేవ‌లు ఎంతో గొప్ప‌వ‌ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ తె‌రాస‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు ఉరిటి వెంకట్రావు, లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండా విజ‌య్‌కుమార్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గాంధీ
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here