శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్పీలు, ఏఎంసీలు, డిప్యూటీ ఈఈ (ఎస్‌డబ్ల్యూఎం), ఏఈ (ఎస్‌డబ్ల్యూఎం), పీటీఓటీఎస్, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణపై సమీక్ష చేపట్టారు.






