మాదాపూర్: హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా, నిధులు మంజూరైన పనులను త్వరగా మొదలు పెట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. రెండు డివిజన్ల పరిధిలోని శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని, కమ్యూనిటీ హాళ్లు అవసరం ఉన్న చోట నిర్మించాలని, ఆదిత్య నగర్ లో పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు, గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీలలో నూతనంగా సీసీ రోడ్లు, యూజీడీ ఔట్‌లెట్ పనులు చేపట్టాలని, సుభాష్ నగర్, భిక్షపతి నగర్, చంద్ర నాయక్ తండా, మాధవ నగర్, రాజారామ్ కాలనీలలో యూజీడీ, సీసీ రోడ్లు, గుట్టల బేగంపేట,సైబర్ వ్యాలీ, కృష్ణ కాలనీ, దోబీ ఘాట్ కాలనీలలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, శాంతి నగర్, ఇంజినీరింగ్ ఎన్‌క్లేవ్, మదీనాగూడా, సాయి నగర్, యూత్ కాలనీ, ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, నందిని నగర్, ప్రకాష్ నగర్, జనప్రియ నగర్ లలో సీసీ రోడ్ల నిర్మాణం, గంగారాం, ఆర్‌టీసీ కాలనీ, ఆల్విన్ కాలనీ, రామకృష్ణ నగర్, మైత్రి నగర్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాలని కోరారు.