నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ 33,34 బ్లాక్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతుగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భాషిపాక యాదగిరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
హస్తం గుర్తుకు ఓటేసి వి. జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముకయ్య, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.