- ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకటసుబ్బమ్మ విజయలక్ష్మి నామినేషన్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకటసుబ్బమ్మ, విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను బుధవారం రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి కీ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నానని, సమతా సమత సైనిక్ దళ్ సొసైటీలో పనిచేస్తున్నానని తెలిపారు. ఎంతోమంది పేదవాళ్లకు ఎన్నో విధాలుగా సేవలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు.. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో తిరిగి సంస్థ పనిచేసిందని తెలిపారు.
ఓటుకు నోటు వద్దు అనే నినాదమే లక్ష్యమని, తను ఒక అంబేద్కర్ వాదిగా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని తెలిపారు. ఎస్సీ .ఎస్టీ. బీసీ మైనారిటీ, ఓసి మహిళలు ఇలా ఇబ్బందుల్లో ఉన్నఎంతోమందికి ప్రజాసేవ చేయడానికి నామినేషన్ వేశానని తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, తుకారం, సంగమ్మ, వినీల, శ్రీదేవి, ఝాన్సీ, పార్వతి దేవి, శ్రావణి, నీలిమ పాల్గొన్నారు.