- ప్రత్యేక పూజలు చేపట్టిన బిజెపి శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ లోని శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గాభవాని అమ్మవారి వార్షిక భోనాల మహోత్సవ వేడుకగా జరిగాయి. ఈ వేడుకల్లో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏళ్లేష్, స్థానిక కాలనీ వాసులతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవి కుమార్ యాదవ్ పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక బోనాల మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుణశేఖర్, బాబు, సత్య కుమార్, ధర్మరాజు, అశోక్, శ్రీను, మహేష్, సురేష్, మురళి, ఎమ్.అశోక్, రాజు, రమేష్, రజినీకాంత్, మహేందర్, కిట్టు, సాయి, భక్తులు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.