అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

  • కమ్మ కార్పొరేషన్ కు ఉత్తర్వుల జారీ హర్షణీయం
  • కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి బండి రమేష్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్
  • మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

నమస్తే శేరిలింగంపల్లి : కమ్మ సామాజిక వర్గంలో ఆర్ధికంగా వెనుకబడిన పేద మధ్య తరగతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇందులో భాగంగా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మియపూర్ డివిజన్ అల్విన్ కాలనీ చౌరస్తా వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు మనెపల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి బండి రమేష్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, ప్రజలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కమ్మ కార్పొరేషన్ కు ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

అల్విన్ కాలనీ చౌరస్తా వద్ద  మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి బండి రమేష్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి.వీరేందర్ గౌడ్, నాయకులు ఇలియస్ షరీఫ్, నాగేశ్వరరావు, కావూరి ప్రసాద్, కొఠారి వెంకటేష్, సత్యనారాయణ, డీవీ ప్రసాద్, రాజేష్, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, సాయి, శ్రీకాంత్, రాంబాబు, వీరాంజనేయులు, సాంబశివరావు, పోలిన సుబ్బా రావు చౌదరి, సుంకావల్లి భగవాన్, శ్రీకాంత్, పట్వారీ శశికాంత్, మాజర్, బ్రమయ్య, శ్రీనివాసరావు, రవి, అమర్, కె.ఎల్ నారాయణ, వేమూరి సాంబశివరావు, రవి కుమార్, నాయుడు, శ్రీను, వెంకట్ రెడ్డి, లోకేశ్వ రావు, వెంకట్ రెడ్డి, అశోక్, నరేష్, మహిళలు పార్వతి, శాంతా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here