
నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో తలెత్తే సమస్యలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ వాహనాలను జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమీషనర్ వెంకన్న, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రతీ ఏడు వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణమే సహాయం అందించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పని చేస్తాయని తెలిపారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.