నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తా నుంచి మంజిరా రోడ్డు మీదుగా ఉన్న నాల పై 1.70 ఒక కోటి డెబ్భై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలసి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెక పూడిగాంధీ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు. వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యాచందానగర్ లింగంపల్లిలను కలిపే ప్రధాన నాల పై కల్వర్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తున్నట్టు తెలిపారు. కల్వర్ట్ నిర్మాణం ద్వారా గ్యాస్ గోదాంకు వెళ్లే రోడ్డు ప్రయాణానికి సులభతరం అవుతుందన్నారు. పదికాలల పాటు ఉండేలా కల్వర్ట్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
