వాజపేయి ఆశయ సాధనకు కృషి చేద్దాం: పోరెడ్డి బుచ్చిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి జయంతిని చందానగర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలను దేశ నలుదిశలా చాటిన మహానేత, వాజపేయికి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ నిష్కలంక దేశభక్తుడని తన పూర్తి జీవితాన్ని భరతమాత సేవకు అంకితం చేసిన మహనీయుడు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతదేశ మాజీ ప్రధాని మాన్యశ్రీ అటల్ బిహారీ వాజపేయి అని, కోట్లాదిమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం, భరతమాత సేవకు పునరంకితమౌతామని పిలుపునిచ్చారు.

చందానగర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న వాజపేయికి నివాళులర్పిస్తున్న పోరెడ్డి బుచ్చిరెడ్డి

ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమౌళి గౌడ్, చిన్నం సత్యనారాయణ, సాయికుమార్ తో పాటు డివిజన్ నాయకులు సురేష్ అమరేందర్ సింగ్, సురేష్, సంపత్, సంజయ్, మణిశంకర్ గౌడ్, ఓ.బి.సి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ యాదవ్, యువమోర్చనాయకులు సందీప్, వినోద్, శ్రవణ్, సాయికుమార్, రఘు, లక్ష్మణ్, పృథ్వి, సాయి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అటల్ బిహారీ వాజపేయికి నివాళులర్పిస్తూ…
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here