నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ బి ఆర్ కాంప్లెక్స్ హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని హుడాకాలనీ, సంతోషిమాత గుడి దగ్గర మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలగా భూదేవి, కుమారి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహిళా విభాగం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు జిల్ మల్లేష్, స్థానిక మహిళా నాయకురాళ్లు కస్తూరి, రాధారాణి, స్వయంప్రభ పాల్గొన్నారు.