విద్యా వలంటీర్ కు వేతనం అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చేపడుతున్నదివ్య శ్రీ శక్తి అపార్ట్ మెంట్ అసోషియన్ సేవలు అభినందనీయమని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధి న్యూ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో దివ్య శ్రీ శక్తి అపార్ట్ మెంట్ అసోషియన్ ఆధ్వర్యంలో నియమించిన ఉపాధ్యాయురాలికి గౌరవ వేతనం చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో దివ్య శ్రీ శక్తి అపార్ట్ మెంట్స్ అసోషియన్ సహకారంతో గౌరవ వేతనం ఇస్తూ ఉపాధ్యాయురాలిని నియమించామని, మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున సొంతంగా విద్యా వాలంటీర్ ను నియమించి నెలనెలా వేతనం చెల్లిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్య శ్రీ శక్తి అపార్ట్ మెంట్ అసోషియన్ అధ్యక్షులు సుధీర్ అడుసుమిల్లి, సుమన్ బత్తుల, ఆంజనేయ చౌదరి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, నిరంజన్ బాలాజీ వర్మ, ధనుంజయరావు, పాటశాల ప్రధాన ఉపాధ్యాయూలు దత్తాత్రేయులు, రామ్ మోహన్ రావు, అర్చన, కృష్ణ రెడ్డి , స్థానిక నాయకులు, బిఏస్ఎన్ కిరణ్ యాదవ్ , సాయియాదవ్, తిమ్మరాజు , నరేష్, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here