- ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి : తారానగర్ లోని శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారి దేవాలయంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ముఖ్య నాయకులు, బూత్ అధ్యక్షులు, బస్తి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్, డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.