- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సభ
- జనసంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గం
- ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన జనం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ పౌరుషాన్ని మల్లి చాటి చెప్పేవిధంగా చేవెళ్ల గడ్డ పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాల్సిందిగా కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. గతంలో డిసెంబర్ 3న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ 420 ప్రభుత్వాన్ని సెమీఫైనల్స్ లో గద్దె దింపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కృషి చేసిన తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, రానున్న మే 13న జరగనున్న ఫైనల్స్ లో గుజరాత్ టీంను ఓడించి మన తెలంగాణ కాంగ్రెస్ టీంను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఈ దేశంలో ఎస్సి, ఎస్టీ, ఓబీసి, బిసి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచన చేస్తున్న బీజేపీ పార్టీకి సరైన గుణపాఠం చెపుదామన్నారు. ప్రతి సామాజికవర్గం నుండి డాక్టర్లగా, ఇంజనీర్లుగా, ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా ప్రజా క్షేత్రంలో నిలదొక్కుకోడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఏర్పాటు చేయగా, వారి ఉన్నతిని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నం చేస్తుందని, దానికి అడ్డుకట్ట వేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ కు 14పైగా ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్యకర్తలందరు కృషి చేయాల్సిందిగా కోరారు. ఢిల్లీలో కుట్ర పూరితంగా తెలంగాణ కాంగ్రెస్ పై వేస్తున్న కేసులకు భయపడేది లేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన 200లకు పైగా కేసులను ధైర్యంగా ఎదురుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ అధిపత్యానికి ఈనాడు జరుగుతున్న పోటీలో గుజరాత్ టీంను డక్అవుట్ చేస్తామని పిలుపునిచ్చారు.
మియాపూర్ నుండి రామచంద్రపురం వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మనకు సోనియామ్మా పునర్విభజన చట్టం ద్వారా ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ జిల్లాలో కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, శేరిలింగంపల్లిలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహద పడ్డారు. విద్యా అభివృద్ధి కోసం ఐఐఎం, ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, గత పది ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది అయ్యా అంటే ‘గాడిద గుడ్డు’ ఇచ్చిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రము కోసం మనం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, హైదరాబాద్ నగరానికి మెట్రో అడిగితే మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు అని ధ్వజమెత్తారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షలు, మహిళలకు 500లకే సిలిండర్, ఆడబిడ్డలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, తెలంగాణ పేదలకు 4 లక్షల ఇళ్ళు, తెలంగాణ నిరుద్యోగులకు 3 నెలల్లో 30వేళ ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, గాడిద గుడ్డు ఇచ్చిన మోడీ కావాలా ఆలోచించాలని తెలిపారు. చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డికి లక్ష మెజారిటీ ఇచ్చేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలనీ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
కార్యక్రమంలో సీఎం ముఖ్యసలహదారులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ టిఎంఆర్ఈఐఎస్ అధ్యక్షులు ఫాయీమ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, టూరిజాం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్,జనాబ్ హమీద్ పటేల్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ సోదరులు,మహిళా సోదరీమణులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.