- కాంగ్రెస్ తీర్థం బీఆర్ఎస్ కార్యకర్తలు..సాదరంగా ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి : ప్రజాపాలనకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం గ్రహించి గచ్చిబౌలి డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఖలీల్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫానగర్ నుంచి సుమారు 500మంది నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సలీం, షాకీర్, అప్జల్, హమీఫ్, అంజద్, ఇక్బాల్, యూసుఫ్, జబ్బార్, అజారుద్దీన్, సిరాజ్, మోసిన్, అహ్మద్, ఇమ్రాన్, అసిఫ్, జకీర్, అస్లాం, ఆఫ్రోజ్, నబి, గౌస్, జావాజ్, మెయిన్, ఫిరోజ్, హసన్, అహ్మద్, హుస్సేన్, మహమ్మద్, రసూల్, అజ్జు నాయకులకు, మహిళ నాయకులు, కార్యకర్తలకు టూరిజాం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, పల్లపు సురేందర్, దయాకర్ యాదవ్, పోచయ్య, డీసీసీ జనరల్ సెక్రటరీ కొమరగొని సురేష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్, జహంగీర్, జుబేర్, హసన్ పాల్గొన్నారు.