తుది దశకు గోపన్ పల్లి తండా ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు

  • శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద రూ. 28 కోట్ల 50 లక్షల అంచనావ్యయం తో ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా పనులను డీసీ రజినీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఆర్ & బీ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు  పరిశీలించేందుకు పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద వై ఆకారంలో ఫ్లై ఓవర్ ను నిర్మించారని, గౌలిదొడ్డి నుండి వన్ వే ట్రాఫిక్ తరహాలో గౌలి దొడ్డి నుండి నల్లగండ్ల వైపు 430 మీటర్లు పొడవు, గౌలిదొడ్డి నుండి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల పొడవు గల మొత్తం 16 nos స్పాన్స్ తో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, ఎన్నో ఏండ్ల సమస్య ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంతో తీరుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ & బీ అధికారులు డీఈ సీతారామయ్య, ఏఈ అజయ్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ స్ట్రీట్ లైట్స్ మల్లికార్జున్, ఏఎంఓహెచ్ నగేష్ నాయక్, ఎస్ఆర్పీ భరత్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, రాజు నాయక్, అనిల్, మల్లేష్, వినోద్, నగేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here