- హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ లో అత్యాధునిక హెయిర్ & ఫేస్ క్లినిక్ ప్రారంభం
- ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన సినీ నటి సిమ్రాన్ చౌదరి
నమస్తే శేరిలింగంపల్లి : హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ లో సినీ నటి సిమ్రాన్ చౌదరి రాకతో సందడి నెలకొంది. ఆమె ఆ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక హెయిర్ & ఫేస్ క్లినిక్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రపంచ స్థాయి సౌందర్య సేవలు హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్లినిక్ లో అందించే ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు. ఆధునిక సౌందర్య చికిత్సలు, జుట్టు, ముఖ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ క్లినిక్ ప్రారంభించారని పేర్కొన్నారు.
డాక్టర్ శరత్ రెడ్డి – డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ ప్రతి రోగి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి, వారికీ అసాధారణమైన సేవలను అత్యంత సంరక్షణతో సంపూర్ణంగా అందించడమే ఈ క్లినిక్ లక్ష్యమన్నారు.
డాక్టర్ రాజశేఖర్ మాదల కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ & హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ మాట్లాడుతూ స్త్రీ, పురుషులలో జుట్టు రాలే సమస్యకు అనేక కారణాలున్నాయని, జుట్టుకి వేసుకునే రకరకాల రంగుల్లో ఉండే కెమికల్స్ ప్రభావం జుట్టుపై పడటం వల్ల జుట్టు రాలుతున్నదని తెలిపారు. అంతేకాక రకరకాల ఒత్తిళ్ళు, మానసిక ఆందోళనలు జుట్టు రాలే సమస్యకు ప్రధాన కారణమవుతున్నదని వివరించారు. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకుంటూ.. బ్యూటీ పార్లర్లలలో రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వినియోగిస్తుంటారని, ప్రతీసారి ఆశించిన ఫలితాలు అందకపోవచ్చునని తెలిపారు. దీనికోమే తాము ఏర్పాటు చేసిన “హెయిర్ & ఫేస్ క్లినిక్‌లో అత్యాధునిక సాంకేతికత, వైద్యపరమైన పురోగతిని ఉపయోగించి సమర్థవంతమైన చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి సౌందర్య సేవలను అందించాలనే లక్ష్యం దిశగా క్లినిక్ ఒక ముఖ్యమైన ముందడుగు” అని డాక్టర్ చెప్పారు.
డాక్టర్ బి. విజయశ్రీ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్ & ట్రైకాలజిస్ట్ మాట్లాడుతూ.. “హెయిర్ & ఫేస్ క్లినిక్ లో ఆరోగ్య సంరక్షణ సేవలు అత్యుత్తమంగా అందించేందుకు అంకితభావంతో పనిచేయనున్నట్లు తెలిపారు.
డాక్టర్ డి. మధు వినయ్ కుమార్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ (రీకన్‌స్ట్రక్టివ్ & కాస్మెటిక్), మాట్లాడుతూ.. రోగుల విభిన్న అవసరాలను తీర్చేందుకే అత్యంత శ్రద్ధ, ఖచ్చితత్వంతో వినూత్నమైన చికిత్సల విస్తృత శ్రేణిని, అసాధారణమైన ఫలితాలను అందించడానికి తమ బృందం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
క్లినిక్ లో అందించు సేవలు:
* హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్
* జుట్టు పెరుగుదలకు పీఆర్పీ (ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా) థెరపీ
* అధునాతన హెయిర్ రిస్టోరేషన్ టెక్నిక్స్
* స్కాల్ప్ మైక్రో-పిగ్మెంటేషన్
* జుట్టు నష్టం నివారణ మరియు చికిత్స కార్యక్రమాలు
* చర్మ పునరుజ్జీవనం
* స్కిన్ బిగుతు, రీసర్ఫేసింగ్ కోసం లేజర్ చికిత్సలు
* బొటాక్స్ , ఫిల్లర్లతో సహా యాంటీ ఏజింగ్ చికిత్సలు
* మొటిమలు, మచ్చల చికిత్స
* కెమికల్ పీల్స్
* మైక్రోనెడ్లింగ్
* ముఖ ఆకృతి
కార్యక్రమంలో డాక్టర్ శరత్ రెడ్డి – డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హరికృష్ణ -ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా, మహేష్ దెగ్లూర్కర్, చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా, డాక్టర్ కొప్పిశెట్టి సత్య నాగ రవితేజ- కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ పాల్గొన్నారు.