- డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ లో డ్రైనేజీ పైప్ లైన్ పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ పనిలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాంక్రీట్ పనులు పూర్తయిన తర్వాత వీలైనంత ఎక్కువసార్లు వాటరింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రామ్ చందర్, పాండు ముదిరాజ్, పవన్, గోపాల్ యాదవ్, కోయాడ లక్ష్మణ్ యాదవ్, భీమని శ్రీను, సురేష్ పాల్గొన్నారు.