- పాల్గొని పూజలు చేసిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాకులో ఎనుముల వెంకటేష్ స్వామి, శ్యామల దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షలు నిండుగా ఉండాలని, ఆ అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో రూప రెడ్డి, వెంకటేష్, శ్యామల, మంగమ్మ, డా. రమేష్, గిరి గౌడ్, రామ స్వామి గౌడ్, యాదగిరి, సత్యం గౌడ్, వెంకటేశ్వర్ల రెడ్డి, వెంకట్ రెడ్డి, లావణ్య, రాజా శేఖర్, మంగలి కృష్ణ, నరేష్, సత్తిబాబు పాల్గొన్నారు.