16 నుంచి అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ప్రారంభం

  • మాదాపూర్ శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య, అడ్మిన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్త కళ ఉత్సవం డిసెంబర్ పదిహేను నుండి ప్రారంభం కానున్నదని మాదాపూర్ శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య, అడ్మిన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పలు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కోసం, హస్త కళకారుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలో శిల్పారామం మాదాపూర్ లో ఆహ్లాదకరమైన ఆవరణలో రేపటినుండి మేళ జరుగనున్నదని, డిసెంబర్ 16న మంత్రి జూపల్లి కృష్ణ రావు, టూరిజం, ఆర్కియాలజీ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శిల్పారామానికి విచ్చేసి ఆల్ ఐడియా క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆద్వర్యంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్, వెస్టబెంగాళ్ కి చెందిన జానపద నృత్యాలను స్పాన్సర్ చేయనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాలు కూడా ఇక్కడ ప్రదర్శింపబడనున్నాయని, ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగు రంగు పూలతో విద్యుత్ దీపాలతో శిల్పారామం సుందరంగా తీర్చబడుతుందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here