పది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయం

  • ‘తాజా ఫుడ్స్’ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం అభినందనీయమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల గుల్మోహర్ పార్క్ నల్లగండ్ల ఎక్స్ రోడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టి ప్రారంభించారు. ప్రప్రథమంగా తానే స్వహస్తాలతో కొనుగోలు చేసి, నిర్వాహకులను సంతోషపరిచారు. ఈ సందర్బంగా నిర్వాహకులు కార్పొరేటర్ కి పూలబొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.

అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గం ఎంచుకొని 10 మందికి దారి చూపడం అభినందనీయమని అన్నారు. ధరలు, నాణ్యత విషయంలో వినియోగదారుల నమ్మకాన్ని పెంచే విధంగా వ్యాపారం నిర్వహించి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన తండు నర్సింహా గౌడ్ కు కార్పొరేటర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీధర్ యాదవ్, వెంకట్ రమణ, జెడ్ పిటిసి తండు సైదులు గౌడ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్, పిల్లి యాదగిరి, నర్సింహ, తిరుమల చారీ, ప్రభాకర్, శ్యామ్ నిర్వాహకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here