నమస్తే శేరిలింగంపల్లి: రాహుల్ గాంధీ శిక్ష పైన సుప్రీమ్ కోర్ట్ స్టే విధించడం పట్ల సంతోషిస్తూ.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో చందానగర్ లో భారీ ర్యాలీగా వెళ్లి అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపున్నారు.
ఈ సందర్బంగా బిజెపి కుట్రను జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు. అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం న్యాయాన్ని కాపాడిందన్నారు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని కావడం తధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మారెళ్ల శ్రీనివాస్, మైనారిటీ చైర్మన్ జహంగీర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, సూర్య రాథోడ్, ఉమాకాంత్, రాము, కొండా మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ పాల్గొన్నారు.