ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు గాంధీ జయంతి సందర్బంగా…. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి కేశవ నగర్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు, పారిశుద్య కార్మికులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చీపురు చేతబట్టి పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అన్నారు. నీటి నిల్వలు ఉంటే దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని, డెంగ్యూ, మలేరియా వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రజలు బాధ్యత తీసుకుని వారి ఇండ్లతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు. చెత్తను వీధుల్లోనూ, కాలువలోనూ కాకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గౌలిదొడ్డి విలేజ్ అధ్యక్షులు దార్గుపల్లి అనిల్, సీనియర్ నాయకులు ములగిరి శ్రీనివాస్, రాజు, శ్రీను యాదయ్య, కేశవ నగర్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here