నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా లో హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి.
అద్దాల సంచులు, బట్టలు, చీరలు, కాచ్ వర్క్ చేసిన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చెక్కతో తయారు చేసిన గృహాలంకారాలు, మడ్ మిర్రర్ వర్క్, పటోళ్ల చీరలు, తంగళియ చీరలు, చున్నీలు, బ్లాక్ ప్రింటింగ్ మెటీరియల్స్ సందర్శకులకు పది రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు కాచి గోడి, పప్పెట్ షో, రాస్ గర్భ నృత్యాలు ఎంతగానో అలరిస్తున్నవి. కందుల కూచిపూడి నాట్యాలయం గురువు రవి శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.