నమస్తే శేరిలింగంపల్లి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, ఫిర్యాదుదారు వివరాల ప్రకారం.. నాచిరెడ్డి నవీన్(22), అతని స్నేహితుడు ముళ్లపూడి హరీష్ చౌదరి (22) గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలికి ద్విచక్రవాహనం (AP10AS1350)పై వెళ్తున్నారు. విప్రోకి 200 మీటర్ల దూరంలోకి వారి బైక్ అదుపుతప్పడంతో ఇద్దరు కిందపడిపోయారు. తలకు, మరికొన్ని చొట్ల తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే వారిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. నాచిరెడ్డి సాయి సందీప్ (24) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.