నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మానస స్కూల్ అఫ్ డాన్స్ గురువు ప్రణవి తుమ్మాటి శిష్య బృందం చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
అంబ పరాకు, వినాయక కౌతం, మూషిక వాహన, మీనాక్షి పంచరత్న, ముద్దుగారే యశోద, విన్నపాలు వినవలె, పలుకే బంగారమయేహ్న, మరకత మణిమయ , ఇదిగో భద్రాద్రి, గరుడ గమన, బిందుమాలిని తిల్లానా, అయిగినందిని, శివస్తోత్రం, నటేశ కౌత్వం, షణ్ముఖ కౌత్వం, మొదలైన అంశాలను లౌక్య, సహస్ర, శాన్వి, వేదాక్షరి, అర్షి, పూర్వి, ప్రదీక్ష, హిమ వర్షిత, దక్ష, గగన దీక్షిత, రుషిక, శ్రీనేత, హిమజ, తేజస్వి, రితిక, చైత్రశ్రీ, తేజస్విని మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.