శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటూ మియాపూర్ డివిజన్ సమస్త ప్రజలకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమలలో కాలనీ సభ్యులతో కలి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు మియాపూర్ డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ ప్రశాంత్ నగర్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు రామచందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రంగారావు, లక్ష్మణ్, త్రివిక్రమ్, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






