శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్. ఆర్. ఎస్టేట్స్ లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువత ముందుకు వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వారు పెద్దల సహకారంతో చాలా భక్తి శ్రద్ధ లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పంచ ముఖ మట్టి వినాయక విగ్రహంఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల క్లాస్సికల్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులకు చక్కటి నృత్యం నేర్పిన గురువు నబనీత భట్టాచార్య, మినీ భట్టాచార్య, చిన్నారుల తల్లిదండ్రులకు, చిన్నారులకు బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రియ, దీపిక, రేవతి, గంగాధర శాస్త్రి, నిర్వాహణ కమిటీ సభ్యులు డి. ఎస్. ఎస్. రెడ్డి, బ్రహ్మ రెడ్డి, హార్సిత్, సుష్మన్త్, తేజ, శివ కమల్, రోనిత్ , తేజూస్, శ్రీ రామ్, సాత్విక్, సిద్ధార్థ్, సింధూర, డి. ఎస్. ఆర్. కె. ప్రసాద్ పాల్గొన్నారు.






