శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): సంత్ ఈశ్వర్ సమ్మాన్ సమితి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో దేశంలో ఉత్తమ సామాజిక సేవ చేసిన 12 మందిని గుర్తించి వారికి సేవా సమ్మాన్ అవార్డును అందజేశారు. అందులో పోతుకూచి ట్రస్ట్ శ్రీనివాస్ కు డిల్లీలో పూస సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు లక్ష రూపాయల నగదు బహుమతితోపాటు మెమెంటోను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస్ భలే, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, సంత్ ఈశ్వర్ సమ్మాన్ సమితి అధ్యక్షుడు కపిల్ ఖన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను శ్రీనివాస్ కలవగా ఆయనకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు.






