శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): నడిగడ్డ తండాలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బంజారా గాంధీ రవీందర్ నాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బంజారాల సంస్కృతిలో గొప్ప పండుగ తీజ్ అని పేర్కొన్నారు. బంజారాలు అందరూ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగించాలని, ఆయన ఆశయాలను సాధించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్వర్ స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, గోపి నాయక్, లకపతి నాయక్, శంకర్ నాయక్, రెడ్యానాయక్, దశరథ్ నాయక్, రఘు, మహేష్, మురళి నాయక్, యూత్ సచిన్, శివ, లక్ష్మణ్ రవీందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.






