శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజక వర్గం గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుల్మోహర్ పార్క్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఖాసిం, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధుడు గాంధీకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొని స్వాతంత్య్రం వచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదట భారతీయ స్వాతంత్య్ర జెండాను ఎగురవేసింది సుభాష్ చంద్రబోస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన మార్గంలోనే నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, బాలరాజ్ సాగర్, డీజే భువన్, లవణాచారి, బేరి చంద్రశేఖర్ యాదవ్, మణిమేఘల తదితరులు పాల్గొన్నారు.






