శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానం అని అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి , బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి రాజకీయ , సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న జీవితం అసమానం అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్ , ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గౌడ్ , యూత్ కమిటీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు కరుణాకర్ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, సురేష్ గౌడ్, రాములు గౌడ్, యాదగిరి గౌడ్, దాత్రి నాథ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్ , మురళి, ఏకాంత్ గౌడ్, చింత కింది రవీందర్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, విద్యాకల్పన ఏకాంత్ గౌడ్, సత్తుర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.





