శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ధ్వజ, శిఖర సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠపన మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, దాత్రినాథ్ గౌడ్, ప్రకాష్ నగర్ కాలనీ అధ్యక్షుడు చింతకింది పవన్ గౌడ్, నరేందర్ గౌడ్, యాదగిరి గౌడ్, బాలింగ్ రమేష్ గౌడ్, బెనర్జీ, శ్రీనివాస్ గౌడ్, పరమేశ్వర్ ముదిరాజ్, రాజారాం, బాలరాజ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవి, మల్లేష్ , రమేష్, వెంకట్ రెడ్డి, రాజేశ్వర్ రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






