శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ గురువు డాక్టర్ రమాదేవి రసోల్లాస్ నృత్య ఉత్సవాన్ని నిర్వహించారు. ధెబ్జాని ఛటర్జీ భరత నాట్య ప్రదర్శనలో మీరా భజన, టాగోర్ సంగీత గీతం , డాక్టర్ మధుసూదన్ భరతాంజలి కేరళ నటనం ప్రదర్శనలో కృష్ణ గాధ, శ్రీ రామ చంద్ర కృపాలు అంశాలను, ఎస్ రమ్య ప్రదీప్ భరతనాట్య ప్రదర్శనలోశబ్దం, తిల్లాన అంశాలను, డాక్టర్ అతిరా, సౌమ్య రామస్వామి కూచిపూడి నృత్య ప్రదర్శనలో కృష్ణ జనన శబ్దం, కళింగ అర్థనా తిల్లాన అంశాలను ప్రదర్శించారు. నాట్య కళా కుశల సాగర అవార్డు 2025 ని పియల్ భట్టాచార్యకి ఇచ్చి సత్కరించారు. ఎస్ పి భారతి ముఖ్య అతిథిలుగా హాజరై కళాకారులందరిని సత్కరించారు.






