శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ ఔట్ లెట్ సమస్యపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సాయి నగర్ కాలనీ ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని అన్నారు. ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన, కుచించుకోపోవడం వలన కాలనీలో మురుగు సమస్య తీవ్రమైందని, ఔట్ లెట్ ను సరి చేసి డ్రైనేజి సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM శ్రీనివాస్ రెడ్డి, DGM నారాయణ, మేనేజర్లు సునీత, శిరీష, వర్క్ ఇన్స్పెక్టర్ కిష్టప్ప, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






