శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 24వ తేదీన మియాపూర్ నరేన్ గార్డెన్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి సన్నాహకంగా ఆగస్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు ఆల్విన్ ఎక్స్ రోడ్ మియాపూర్ లోని అతిధి బాంక్వెట్ హాల్ లో శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. కనుక శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని కోరారు.





