శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): కేరళ రాష్ట్రం అలువా నగరంలో వైయంసిఎ హాల్ లో కేరళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం. కుమార్ అధ్యక్షతన కొనసాగుతున్న యంసిపిఐ ( యు) కేంద్ర కమిటీ మూడు రోజుల సమావేశాల్లో వృద్ధాప్యం, అనారోగ్యంతో మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేబి శర్మకి, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి యస్ అచ్యుతానందన్, గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ దాడిలో మరణించిన పౌరులకు, పిల్లలకు, ప్రకృతి విపత్తులో మరణించిన వారందరికీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి యంసిపిఐ (యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడి దారీ విధానం పతనావస్థకు చేరువలో ఉందని అందులో భాగంగానే ఈమధ్య అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలతో పాటు, సుంకాల పెంపు పేరుతో వాణిజ్య యుద్ధం ప్రారంభం వెనుకాల పతనం అవుతున్న సామ్రాజ్య, పెట్టబడి దారి, కార్పోరేట్ ఆర్థిక విధానాలు అనేది స్పష్టంగా కనపడుతుంది అని అన్నారు. ఉత్పత్తి పెంచకుండా, ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కాకుండా కేవలం దోపిడీ ని ఆధారంగా చేసుకుని ప్రపంచ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న అమెరికా దాని మిత్ర దేశాలు చావు దెబ్బ తినటం ఖాయం అని అన్నారు. భారత దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా పాలన కూడా నియంతృత్వ పద్దతిలో ఇంకా ఎన్నో రోజులు సాగవు అని వారి పతనం త్వరలో ఉంటుంది అని అన్నారు.

ఈ సమావేశంలో యంసిపిఐ (యు) పోలిట్ బ్యూరో సభ్యులు కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, అనుభవ్ దాస్ శాస్త్రీ, మహేందర్ నేహా, జార్జ్, కృషమ్మాల్, రాజా దాస్, వల్లెపు ఉపెందర్ రెడ్డి, కాటం నాగభూషణం, చంద్ర మోహన్ ప్రసాద్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కుంభం సుకన్య, వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, తూమాటి శివయ్య, శ్రావణి పూడి నాగరాజు, యస్ కే ఖాదర్ భాషా, అన్నీస్ జార్జ్, మహేంద్ర పాండే, హర్మేల్ సింగ్, నిరంజన్ సింగ్, గుర్తేష్ సింగ్, రాజబాబు, భూప్ నారాయణ సింగ్, డెన్నిస్, తనక్పన్, తివారీ తదితరులు పాల్గొన్నారు.





