- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
- శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (ఆత్మబలిదాన్ దివస్) సందర్భంగా ఘన నివాళి
నమస్తే శేరిలింగంపల్లి : అఖండ భారతావనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా చెప్పిన గొప్ప మహానీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఆత్మబలిదాన్ దివస్ సందర్భంగా కూకట్ పల్లి డివిజన్ డివిజన్, పాపిరెడ్డి నగర్ బస్తీదావఖన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన పేరు మీద రోడ్లకు ఇరువైపున మొక్కలు నాటి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు యువకులు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులైన రవి కుమార్ యాదవ్ సమక్షంలో బిజెపిలో చేరారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ సమగ్రత, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే నాటి నెహ్రూ విధానాలను తీవ్రంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. దేశం మొత్తం ఒక్కటే భారత రాజ్యాంగం అమలు చేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ కో-కన్వీనర్ మని భూషణ్, రామరాజు, డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింగ్ రావు ,రాజిరెడ్డి, నర్సింగ్ యాదవ్, కేశవ్ ,పర్వతాలు యాదవ్, నరసింహ చారి, బాలు యాదవ్, శ్రీకాంత్, నరేష్, రఘునాథ్, ఇంద్రసేనారెడ్డి, సిద్దయ్య, సాయి, విజయ్, రవి కుమార్, నరసింహ, గణేష్, రామ్ రెడ్డి శ్రీనివాసులు, రఘు, హరీష్ యాదవ్, స్రవంతి, కవిత, సంధ్య, అరుణ లోకేష్, కామరాజు పాల్గొన్నారు.