ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ సమీపంలో రాజరాజేశ్వరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ విల్లె ప్రీస్కూల్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూత్ కెన్ లీడర్ ఫౌండర్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. స్కూల్ చైర్మన్ ఆశ, వినయ్ నాయుడు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలనీ వాసులకు అతి దగ్గరలో ఉండే విధంగా స్కూల్ ఏర్పాటు చేయడం అభినందించవలసిన విషయమన్నారు.
ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఫీజు పరిమితి ఉండే విధంగా చూడాలని, అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుంచే చదువుతో పాటే దేశ సంస్కృతి, సాంప్రదాయాలను, మానవత్వ సంబంధాలను నేర్పించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతోపాటు డాక్టరు రాజేష్ రెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ జగపతిరావు, రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ నవీన్ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు.